శాశ్వత అంగవైకల్యం కలిగినవారికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
గౌడ ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం: కేజీకేఎస్
దంతాలపల్లి సెప్టెంబర్ 21 జనం సాక్షి
గీత కార్మికులు విధి నిర్వహణలో భాగంగా తాడిచెట్టు పై నుండి పడి మృతి చెందినా, శాశ్వత అంగవైకల్యం కలిగిన గీత కార్మికుడికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎం వి రమణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గండి వెంకట నారాయణ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సంఘం మండల మహాసభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ… దళిత,గిరిజనులకు ప్రకటించినట్లుగా ప్రతి గౌడ కుటుంబానికి గౌడ బందు ప్రకటించాలని, కులవృత్తిని చేసుకునే ప్రతి గీత కార్మికునికి మోటారు సైకిల్ ఇవ్వాలని,ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి. ఇచ్చి హరితహారంలో పెట్టే చెట్లను సొసైటీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. నీర ఉత్పత్తి యూనిట్లను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని గీత కార్మికుల సంక్షేమం కోసం 5 వేల కోట్లు కేటాయించాలన్నారు. ప్రతి గౌడ కులస్తుడికి సభ్యత్వ కార్డు ఇవ్వాలన్నారు. గౌడ కుల రక్తంలోనే పౌరుషం ఉందని గౌడ కులస్తులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని ఉద్బోధించారు.అదేవిధంగా పేద గౌడ కుటుంబాలకు గౌడ సంఘం ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండల నూతన అధ్యక్షులుగా గండి వెంకటనారాయణ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా తండ రాములు గౌరవ అధ్యక్షులుగా గుండగాని లింగయ్య,కొత్త కొమురెల్లి, కోశాధికారిగా భూపతి యాకయ్య,ముఖ్య సలహాదారుగా కొత్త అంతయ్య లతోపాటు ఆర్గనైజర్ గా కందునూరి యాదగిరి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యామగాని వెంకన్న, కుమ్మరి కుంట్ల ఎంపిటిసి దుబ్బాకుల వెంకన్న, లక్ష్మీపురం గ్రామ ఉపసర్పంచ్ రాము,కొంపల్లి వెంకన్న,దేశగాని అశోక్ తదితరులు పాల్గొన్నారు.