శాసనసభ మరోసారి వాయిదా
హైదరాబాద్,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనల మధ్య శాసనసభ మరోసారి వాయిదా పడింది. వివిధ అంశాలపై విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. అంతకుముందు ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాల తిరస్కరణపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ అరగంట వాయిదా పడింది.