శాసనసభ రేపటికి వాయిదా
హైదరాబాద్,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనల మధ్య శాసనసభ రేపటికి వాయిదా పడింది. తెలంగాణపై తీర్మానం చేయాలని తెరాస, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని తెదేపా సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు సభ విపక్షాల ఆందోళనల మధ్య రెండు సార్లు వాయిదా పడింది.