శిక్షణ తరగతులను సందర్శించిన జిల్లా ఎఎంసీి అధికారి వజ్రయ్య
నర్సంపేట, జూన్ 6:
ఈవిద్యా సంవత్సరం 6,7వ తరగతులకు మారిన తెలుగు పాఠ్య పుస్తకాలపై అవగాహన కోసం నర్సంపేటలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను బుధవారం జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పి.వజ్రయ్య సందర్శించారు. నెక్కొండ, నర్సంపేటస్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ఏడు మండలాలల తెలుగు ఉపాధ్యాయులకు నర్సంపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వజ్రయ్య మాట్లాడతూ మారుతున్న విద్యా విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా మారాలన్నారు. ఎన్‌సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఎపిఎస్‌సిఎఫ్ 2011 ఆధారంగా మారిన పాఠ్య పుస్తకాలలోని పాఠ్యాంశాలను అవగాహన చేసుకుని రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థులకు విద్యా బోధన చేయాలని సూచించారు. శిక్షణ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఉపాధ్యాయుడు జూన్ 15వ తేది నుంచి పాఠశాల సంసిద్ధతా కార్యక్రమం, తరగతి గది సంసిద్ధతా కార్యక్రమాలు తప్పక నిర్వహించి బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ ఎం.రవీందర్, జిల్లా పరిశీలకుడు లింగ