శివకేశవాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు

చొప్పదండి (జనంసాక్షి): వేయి సంవత్సరాలకు పైగా చరిత్ర గల చొప్పదండిలోని శివకేశవాలయంలో గురువారం త్లెవారుజామున గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి. శంభుస్వామి అలయంగా ప్రసిద్ధిచెందిన ఈ ఆలయంలోని శివాలయంలంపై గాల గోపురాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు. చాళుక్య రాజుల కాలంలో నిర్మాణమై, కాకతీయుల కాలంలో పునర్నిర్మాణమైన శివకేశవాలయంలో గతంలోనూ గుప్త నిదుల కోసం తవ్వకాలు జరిగాయి. ఆలయ పకరిసరాల్లో పలు చోట్ల కొన్ని సార్లు, శివాలయం ముందు ఉన్న నంది విగ్రహం వద్ద మరో సారి గుప్త నిధుల కోసం వేట సాగింది. గురువారం రాత్రి చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో తెల్లవారు జామున గుప్త నిధుల వేటలో ఆలయ శిఖరాన్ని ధ్వంసం చేయడంతో భక్తులు భరయాందోళన చెందుతున్నారు. ఎస్సై అశోక్‌ ఆలయ పరిసరాలను పరిశీలించారు. రాత్రి 2 గంటల వరకు పెట్రోలింగ్‌ నిర్వహించామని, తమ వాహనం రావడంతో దుండగులు పారిపోయి ఉంటారని ఎస్సై చెప్పారు.