శివరాత్రి ఉత్సవాలకు ఆలయాల ముస్తాబు
కడప,ఫిబ్రవరి16(జనంసాక్షి ): కడప జిల్లాలో ప్రధాన ఆలయాల్లో శివరాత్రి ఏర్పాట్లు జోరుగా చేపట్టారు. ఇక్కడికి వచ్చే భక్తులకు, శివరాత్రి జాగారాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పుష్పగిరిలో మంగళవారం సంతానమల్లేశ్వరస్వామికి కల్యాణాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసారు. తెల్లవారు జాము నుంచి అభిషేకాలు, 8 గంటల వరకూ సర్వదర్శనం, తర్వాత శివపార్వతుల కల్యాణం, పెళ్లి భోజనాలు ఉంటాయన్నారు. పుష్పగిరి క్షేత్రాధిపతి శ్రీవైద్యనాదేశ్వరస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు ¬మాలు అభిషేకాలు ఉంటాయని, తెల్లవారుజాము నుంచే రుద్రాభిషేకాలు చేస్తామన్నారు. పెన్నానదిలో స్నానాలు ఆచరించి సస్వామి దర్శనానికి భక్తులు భక్తులు భారీగా తరలివస్తారు. వల్లూరు శివారు గంగాయప్లలె, లేబాక, పైడికాలువ శివాలయాలను ముస్తాబు చేస్తున్నారు. కడప- తాడిపత్రి జాతీయ రహదారిపై ఇందిరానగర్ శాటిలైట్‌నగరం శివాలయంలో ప్రథమంగా శివపార్వతుల కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ప్రముఖ శైవక్షేత్రం పొలతల క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది.
పెండ్లిమర్రి మండలం గంగనప్లలె పంచాయతీ పరిధిలోని శేషాచల పర్వతశ్రేణుల్లోని కొండకోనల నడుమ ఈ క్షేత్రం ఉంది. ఆరాధ్యదైవం మల్లేశ్వరస్వామి. మహాశివరాత్రి, కార్తీకమాస, వారోత్సవాలకు జిల్లా నుంచే కాక ఇతర రాష్టాల్ర నుంచి వేలాది వాహనాల్లో భారీగా భక్తులు తరలివస్తారు. మల్లేశ్వరస్వామి, అక్కదేవతలు, బండెన్న స్వామి దర్శనం చేసుకుంటారు. కడప పాత బస్సుస్టాండు, ఆర్టీసీ బస్సుస్టాండు నుంచి సీకేదిన్నె విూదుగా పొలతలకు, పులివెందుల, వేంప్లలె నుంచి వెల్లటూరు, తిప్పిరెడ్డిప్లలె విూదుగా పొలతలకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పొలతల తారుదారిలో కొండపైన మలుపుల వద్ద రక్షణ కవ్మిూలను ఏర్పాటు చేశారు.