శీదిలభవనంతో…. పిల్లలు జర పదిలం.

.! పెచ్చులుడూతున్న అంగన్వాడీ కేంద్రం… భయందోళనలో విద్యార్థులు…? ఫోటోరైటప్:పెచ్చులు ఊడిపడుతున్న అంగన్వాడీ భావనం
* పెన్ పహాడ్ మార్చి 14 (జనం సాక్షి) : ఐసీడియస్ ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు విద్య బుద్దులు నేర్పించడం కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకునే వారే లేకపోవడంతో కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలు శీదిలావాస్థకు చేరి భవనం పెచ్చులు ఊడి పడుతున్నాయి అదేకోవకు చెందిన అంగన్వాడీ కేంద్ర భవనం–1, మండలంలోని గాజుల మల్కాపురం గ్రామంలో చోటు చేసుకుంది చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టక ఆహారం అందిచడం కోసం 1998వ సంవత్సరంలో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం–1,భవనంలో 18 మంది పిల్లలకు విద్య బుద్దులు అందిస్తుండగా భవనం శిదిలావస్థకు చేరి ఎప్పుడు పిల్లలపై సిబ్బంది పై కూలి పడిపోతుందోనని, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ఈ భవనం పెచ్చులు ఊడి పడి పలుమార్లు విద్యార్థులు గాయపడిన సంఘటనలు ఉన్నాయని పలువురు గ్రామస్థులు వాపోతున్నారు భారీ ప్రమాదం చోటు చేసుకోకముందే శిదిలావస్థలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని కూల్చి వేసి నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు…