శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. ఈ నెల 10 నుంచి అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని సమావేశాల్లో ఎలా వ్యవహరించాలనే అంశం పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మంత్రివర్గం నుంచి డీఎల్‌ తొలగింపు, ధర్మాన, సబిత రాజీనామాల ఆమోదం తర్వాత జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.