శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్దే తన ప్రథమ కవర్తవ్యం – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”

ప్రజల ఓట్లతో గెలిచి రాజ్యాంగ వ్యవస్థలో కొనసాగుతున్న తనకు శేరిలింగంపల్లి డివిజన్ ప్రజల సమగ్రాభివృద్దే తన ప్రథమ కర్తవ్యం అని, వారి సంక్షేమంకోసం అహర్నిశలు కృషి చేస్తానని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్పష్టంచేశారు. ఈ మేరకు డివిజన్ పరిధి రాజీవ్ గృహకల్ప సముదాయం పరిధిలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం స్థానిక నాయకులు, ప్రతినిధులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నమ్మకమే పెట్టుబడిగా, తనను నమ్మి ఓటేసిన ప్రజలకు తప్పకుండా కృతజ్ఞుడినై ఉంటానని, ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ వ్యవస్థలో అధికారికంగా పని చేసే గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు అభివృద్ధితోనే డివిజన్ ప్రజల రుణం తీర్చుకుంటానని రాగం స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధిగా ఎన్నేళ్లు పని చేసినా, ఎక్కడ పని చేసినా… శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్దే అంతిమ లక్ష్యం అని నాగేందర్ యాదవ్ పునరుద్ఘాటించారు. రాజీవ్ గృహకల్ప కాలనీవాసుల సౌలభ్యంకోసం నూతన సీసీ రోడ్డును చేపడుతున్నట్లు కార్పొరేటర్ వివరించారు. నూతన సిసి రోడ్డును వేస్తున్న కారణంగా ప్రజలకు కొంత అసౌకర్యం కలిగినప్పటికీ అంతిమంగా సుఖవంతమైన రవాణాకోసం కొంత భరించక తప్పదన్నారు. వీలైనంత తొందరగా సిసి రోడ్డు పనులను పూర్తి చేయాలని ఇటు కాంట్రాక్టర్ ను, అటు అధికారులను రాగం ఆదేశించారు. తను నన్ను నమ్మి ఓటేసిన డివిజన్ ప్రజలు, ఓటర్లు తనకు సర్వస్వమని వారి అభివృద్ధి తనకు పరమావదని అన్నారు. డివిజన్ పరిధిలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి పనిని ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేస్తానని ఈ సందర్భంగా హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు శ్రీకళ, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షులు బసవరాజ్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, మహేష్ రాపన్, సీనియర్ నాయకులు సుధాకర్, ఉమాకాంత్, మహిళా నాయకురాలు రోజా, లక్ష్మి, కాలనీవాసులు చర్చలు పాల్గొన్నారు.