శ్రీకాంతాచారి తెలంగాణ వేగు చుక్క : బిసి సంక్షేమ సంఘం ఘన నివాళి

. శ్రీకాంతాచారి  తెలంగాణ వేగుచుక్క అని బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు.శనివారం
తెలంగాణ మలిదశ తొలి విద్యార్థి అమరవీరుడు శ్రీకాంత్ చారి 13వ వర్ధంతి కార్యక్రమం నేరేడుచర్లలో జరిగింది.ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ
 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమాన్ని  రగిలించడానికి అగ్నికి ఆహుతై తన  ప్రాణాన్ని విప్లవాగ్నికి అంకితం చేశారు.మళ్లీ దశ ఉద్యమానికి ఊపిరి పోసిన తెలంగాణ వీరుడని తెలంగాణ ఉద్యమంలో భావితరాల బంగారు భవిత కోసం దశాబ్దాల తరబడి స్వరాష్ట్ర సాధన కోసం ఎందరో వీరుల బలిదానాలను కళ్లారా చూసిన శ్రీకాంత్ చారి నేను సైతం నా స్వరాష్ట్ర సాధన కోసం తెగించాలని నిర్ణయించుకొని తన ప్రాణాలను లెక్కచేయకుండా నాటి పాలకులు అవలంబించిన విధానాలకు విసిగిపోయి తన ప్రాణాలు పోయినా కనీసం పాలకులు కళ్ళు తెరుస్తారని ఆశించి అసమాన త్యాగం చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన అమరజీవి శ్రీకాంత్ ఆచారి అని ఆయన అన్నారు. 2009వ సంవత్సరం నవంబర్ 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జై తెలంగాణ అని నిలదీస్తూ  ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుటించుకున్న శ్రీకాంత్ చారి భగభగ మండిపోయాడని తెలంగాణ కోసం నడిరోడ్డుపై మంటల్లో కాలుతున్న దృశ్యాలను ఆనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు టీవీల్లో చూసి ప్రతి ఒక్కరూ తెలంగాణ సాధన కోసం ఉధ్యు క్తులయ్యారని సకల జనులు సబ్బం డ వర్గాల వారు ముఖ్యంగా విద్యార్థులు ఆ తర్వాత సుమారు 1200 మంది చేసిన అపూర్వ ప్రాణ త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని శ్రీకాంతాచారి ఆశయాల ప్రేమికులుగా బంగారు తెలంగాణ సాధనలో మనమంతా నిమగ్నం కావడమే శ్రీకాంతాచారి కిచ్చే అసలై న నివాళి అని అన్నారు.శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేరేడుచర్ల మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి సుందరయ్య, మాజీ సర్పంచ్ ఆకారపు వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను  బీసీసంఘం నాయకులు టి శ్రీకాంత్ ఊదర వెంకన్న తునికి పాటి జగన్నాధాచారి కోపగాని మారయ్య గౌడ్ బచ్చలికూరి సుందర్రావు గాదే సైదులు రాంప్రసాద్ శ్రీపాద శ్రీనివాసాచారి ఇంజమూరి వెంకటయ్య పాల్గొన్నారు.