శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం
)తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతా చారి 14వ, వర్ధంతి వేడుకలను బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావణ్ మాట్లాడుతూ తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన తొలి అమరుడు కాసోజు శ్రీకాంతా చారి అనీ అనంతరం స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో 1200ల మంది తెలంగాణ విద్యార్థులు, మేధావులు, ప్రాణ త్యాగాలు చేస్తే దాన్లో 90 శాతం మంది బీసీ ,ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీ, బిడ్డలే ఉన్నారు అని . తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం వస్తుందని, తెలంగాణ ప్రతి ఇంట సంతోషాల నిండితాయని, ఆనాడు ఎంతోమంది తెలంగాణ బిడ్డలు స్వరాష్ట్ర సాధన కోసం వారి ప్రాణాల్ని గడ్డిపుసల భావించి త్యాగాలు చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.