శ్రీకాంతాచారి పేరుమీద స్మారక నిర్మాణాన్ని చేపట్టాలి:

విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి
 ఎల్బీనగర్ (జనం సాక్షి ) తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ప్రాణాలర్పించిన కాసోజు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహానికి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన స్వరాష్ట్రాన్ని సాధించాలనే తలంపుతో ఆత్మబలిదానానికి సైతం సిద్ధపడి తన ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప త్యాగి కాసోజు శ్రీకాంత్ చారి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి విశ్వబ్రాహ్మణుల పాత్ర కీలకమైనదని శ్రీకాంతాచారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వరాష్ట్రంలో అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నామని శ్రీకాంత్ చారి ప్రాణత్యాగం చేసిన ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి శ్రీకాంతాచారి పేరుమీద స్మారక నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు శ్రీకాంతాచారి కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం రెండు వేల గజాల స్థలం కేటాయించాలని ఆయన తల్లి కాసోజు శంకరమ్మ కు రాజకీయంగా ఎదిగేందుకు ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్ట్ అందించి వారి కుటుంబం తెలంగాణ స్వరాష్ట్రం కోసం చేసిన త్యాగాలను గుర్తించాలని సుంకోజు కృష్ణమాచారి విజ్ఞప్తి చేశారు