శ్రీకాకుళంలో సీఎంకు ఘన స్వాగతం

శ్రీకాకుళం, జూలై 27: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనుటకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి శ్రీకాకుళంలో ఘన స్వాగతం లభించింది. శువ్రారం ఉదయం ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి కొండ్రు మురళీమోహన్‌, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారయణ, గనులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పార్లమెంట్‌ సభ్యురాలు కృపారాణి, శాసన సభ్యులు బొడ్డేపల్లి సత్యవతి, కొర్లభారతి, జగన్నాయకులు, శాసన మండలి సభ్యులు పీరుకట్ల విశ్వప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు కె.వి.వి.గోపాలరావు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు.

తాజావార్తలు