శ్రీలంక పై భారత్‌ విజయం

పల్లెకెలె : పల్లెకెల్లో జరిగిన ఐదో వన్డేలో భారత్‌ శ్రీలంక పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 4-1 తేడాతో సిరీస్‌ తో కైవసం చేసుకుంది.ఆఖరిదీ….మనదే
-ఐదో వన్డేలో శ్రీలంకపై విజయం…
పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలోనూ భారత్‌ జయకేతనం ఎగురవేసింది. శ్రీలంకపై 20పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించి 4-1తో సిరీస్‌ కైవసం సాధించింది. వి జయంతో సిరీస్‌ ప్రారంభించిన భారత్‌ విజయం తోనే సిరీస్‌ను ముగించడం విశేషం. శనివారం తొలుత టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలలో 7 వికెట్ల నష్టానికి 294 పరుగుల భారీస్కోర్‌ సాధించింది.భారత్‌ ఆటగా ళ్లు విజృంభించారు. భారత డాషింగ్‌ఓపెనర్‌ గం బీర్‌, మనోజ్‌ తివారి, ధోనిలు అర్ధసెంచరీలతో క దం తొక్కారు. 88 పరుగులు సాధించిన గంభీర్‌ భారత్‌ గెలుపునకు మార్గం సుగమంచేశాడు. ధా టిగా ఆడిన గంభీర్‌కు మనోజ్‌తివారి చక్కని స హకారం అందించాడు. చివర్లో ధోని మెరుపులు మెరిపించడం,ఇర్ఫాన్‌29(28)పరుగులతో పర్వా లేదనిపించడంతో భారత్‌ 294పరుగులు సాధిం చింది. ఈమ్యాచ్‌లో గంబీర్‌ తనవ్యక్తిగత కెరీర్‌లో వన్డేల్లో 5వేల పరుగుల మైలురాయికి చేరుకుని రికార్డు సృష్టించాడు. శ్రీలంక బౌలర్లలో మలింగ 3, పెరేరా 1, ప్రదీప్‌ 2, సేనానాయకే ఒక వికెట్‌ తీసుకున్నారు.అనంతరం 295పరుగుల లక్షంతో బరిలోకి దిగిన లంకఆటగాళ్లకు ఆదిలోనే పఠాన్‌ షాక్‌ ఇచ్చాడు. కేవలం 3 బంతులకే దిల్షాన్‌(0) ను పెవిలియన్‌ కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన థిరిమన్నె(77) తరంగ(31) కుదురుగా ఆడి లం క ఇన్నింగ్స్‌ను గాడిన పడేశారు. అయితే మరో మారు బంతి అందుకున్న పఠాన్‌ ఓ అద్బుతమైన డెలివరీ ఆడిన తరంగ రహనేకు క్యాచ్‌ ఇచ్చి వ ెనుదిరిగాడు. ఇక అక్కడి నుంచి లంకపతనం ప్రారంభమయింది. చందిమల్‌(8) ఇలావచ్చి అలా వెళ్లిపోగా,ఆల్‌రౌండర్‌ మాథ్యూస్‌(13) లేని పరుగుకోసం ప్రయత్నించివికెట్‌ పారేసుకున్నా డు.కపుగెదెర(9) జహీర్‌బౌలింగులో ఎల్బీడబ్ల్యు గా వెనుదిరిగాడు. అదే సమయంలో జీవన్‌ మెం డిస్‌ విజృంభించిఆడాడు.భారత్‌బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో కెప్టెన్‌ ధోని బంతిని తిరిగి పఠాన్‌కే అందించాడు.