శ్రీలంక సైన్యంలో తమిళ వనితల నియామకం

కొలంబొ: ఇప్పటివరకు కేవలం సింహళీయులే ఉన్న శ్రీలంక సైన్యంలో ఇక తమిళులకూ చోటు లభించనుంది. వచ్చే శనివారం కిలినోచ్చిలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో 18-22 ఏళ్ల మధ్య వయస్సు తమిళ యువతులు వందమందిని సైన్యంలో శిక్షణకు ఎంపిక చేస్తున్నట్లు అధికారు వర్గాలు ప్రకటించాయి. గత ఏడాదే దాదాపు వెయ్యిమంది తమిళ యువకులను శ్రీలంక పోలీసు ఉద్యోగాల్లో నియమించింది.