శ్రీవారి భక్తులకు మరో విశ్రాంతి భవనం
తిరుమల: శ్రీవారి భక్తులకు మరో విశ్రాంతి సముదాయం అందుబాటులోకి రానుంది. సముదాయం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అతి త్వరలోనే 30గదులతో ఉన్న నారాయణగిరి కాటేజీల సముదాయంవరుసలోని నూతన భవనాన్ని యాత్రికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.