శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోప్రజలకు ఉచిత పౌర సేవలు శ్రీ గణేష్

కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 31 కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజల కోసం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీ కారం చుట్టిన శ్రీ గణేష్ ఫౌండేషన్. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేసే వివిధ పథకాల విషయమై ప్రభుత్వ కార్యాలయ చుట్టూ ప్రదక్షిణ చేయకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ సేవలను పేదల ఇంటివద్దే ఉచితంగా అందించేందుకు శ్రీ గణేష్ ఫౌండేషన్ కృషిచేస్తుంది.శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 12 ప్రభుత్వ ఆన్లైన్ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. అందులో ప్రధానంగా రేషన్ కార్డ్ కరప్షన్,వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్,కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్, వితంతు పెన్షన్,ముఖ్యమంత్రి సహాయనిధి, కొత్త ఓటర్ కార్డు,ఓటర్ కార్డ్ నేమ్ కరప్షన్, అబా కార్డ్ సర్వీస్లను అందిస్తున్నారు.
ఈ ఆన్లైన్ సేవలను ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గం లోని ఒకటవ వార్డు న్యూ బోయినపల్లి పెన్షన్ లైన్,రెండవ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద, మూడవ వార్డులో ఖార్ఖానా ముత్తుమరియమ్మ ఆలయం సమీపంలో, నాలుగవ వార్డు పీకేట్ గాంధీ నగర్ హట్స్ దగ్గర. ఐదవ వార్డులో కాకాగూడ లో హనుమాన్ టెంపుల్ వద్ద ఈ సేవలను శ్రీగణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయటంలోనే సంతృప్తి ఉందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ గణేష్ అన్నారు. ప్రతి ఏటా ప్రజా అవసరాలకు తగ్గట్టుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను.కంటోన్మెంట్ ప్రజలు ఆశీర్వదిస్తే రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతానని అన్నారు.ఇందుకు ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది.ప్రజలకు అందుబాటులో ఉండి వాలంటరీగా సేవలు అందజేస్తారు.సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు ఈ ఉచిత ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అన్నా నగర్ బోనాల పండుగ సందర్భంగా
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అన్నా నగర్ లోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ గణేష్. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తొట్టెల ఊరేగింపును ప్రారంభించారు.

తాజావార్తలు