శ్రీ పాదుకాపీఠ ప్రతిష్ట మహోత్సవం

వీణవంకవీణవంక, . ఆగస్టు 31( జనం సాక్షి ) వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శ్రీ కిషన్ ప్రసాద్ రావ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరుగుతున్న శ్రీ పాదుకాపీఠం ప్రతిష్టా మహోత్సవాలలో భాగంగా గురువారం అశేష భక్తుల సమక్షంలో శ్రీపాదుకాపీఠ ప్రతిష్టను వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు దండంరాజు ఫణీంధరావు పర్యవేక్షణలో తిరుపతి వేదపండితుల ఆచార్యత్వమున వైదిక ఆగమం ప్రకారం పాదుకాపీఠ ప్రతిష్టను నర్సింగాపూర్ లో కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు నర్సింగాపూర్ గ్రామం తో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలిరాగా విగ్రహ ప్రతిష్టాపనలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకోగా, ఆశీర్వాదాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఫణీంధర్ రావు మాట్లాడుతూ మన ప్రాంతంలో ఎక్కడాలేని విధంగా అయ్యప్ప స్వామి, సుమారు 40 దేవతామూర్తుల యంత్ర ప్రతిష్టాపన నిర్వహించడం జరిగిందని, గ్రామంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడంతో పాటు, ప్రతిష్టా మహోత్సవాన్ని జరుపుకున్నాము మండలం తోపాటు చుట్టు పక్కల భక్తులు కూడా శ్రీ పాదుకాపీఠానికి వచ్చి దేవతామూర్తుల ఆశీర్వాదాలు పొందాలని కోరారు. అనంతరం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయగా గ్రామ ప్రజలు, భక్తులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాడి సౌజన్య తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ జడల పద్మలత రమేష్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు ముడుగూరి సమ్మరెడ్డి. | గూటం సమ్మిరెడ్డి, గ్రామ పెద్దలు, నాయకులు, వేదపండితులు, సతీష్ శర్మ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు