శ్రీ మహాలక్ష్మి ఆలయంలో వరలక్ష్మి వ్రతం – పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
జనంసాక్షి, మంథని :
నిజ శ్రావణమాసంలో వచ్చిన మొట్టమొదటి వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా మంథని పట్టణంలోని శ్రీ మహా లక్ష్మి అమ్మవారిని చూడముచ్చటగా అలంకరించారు. అనేక రకాల పుష్పాలతో అలంకరించిన అమ్మవారిని చూసిన భక్తులు ముద్దులయ్యారు. తెల్లవారు జామున అమ్మవారికి వేదోప్తంగా ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పసుపు కుంకుమ సారే గాజులు పువ్వులు సుగంధ ద్రవ్యాలను సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అలాగే ఆలయంలోని మండపంలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. ఎన్నడు లేని విధంగా భక్తులు అధిక సంఖ్యలో దర్శనం కొరకు రావడంతో ఆలయంలో పండుగ వాతావరణం నెలకొంది మంథని శ్రీ మహాలక్ష్మి ఆలయం ఎంత విశిష్టత కలిగి ఉంది. వరలక్ష్మి శుక్రవారం పురస్కరించుకొని ఆలయంలో దీపాలంకరణతో పాటు రాత్రి ప్రత్యేక భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వహణ కోరారు.