శ్రీ లక్ష్మీ, సరస్వతి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము

 

 

 

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో వినాయక నగర్ లో లక్ష్మీ సరస్వతీ సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగ జరిగింది అత్యంత అంగరంగ వైభవంగా సర్వదేవతా పూజలు, హోమం, యంత్ర ప్రతిష్టలు, శ్రీ మహాలక్ష్మి గణపతి సరస్వతీ దేవి ధ్వజ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమములు పూర్ణాహుతి నేతృణ్మలనం బలి ప్రధానం కుంభం దేవతామూర్తులకు విశేష అలంకరణ అర్చనాదులు మహా నివేదన మంగళహారతి మంత్రపుష్పాదులు బ్రాహ్మణ ఆశీర్వచనం తీర్థ ప్రసాద వినియోగం అనంతరం మహాన్నదానం జరిగిందని వినాయక నగర్ దేవస్థాన కమిటీ భక్త బృందం తెలిపారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు భజనలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయని తెలిపారు గత మూడు రోజులగా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు నిష్టతో పాల్గొని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని దేవతామూర్తులను దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రతిష్టాపకులు, పూజారులు మాట్లాడుతూ ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పాడిపంటలు చక్కగా పండాలని రైతు సోదరులు సంతోషంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నామని తెలిపారు గత మూడు రోజులుగా ఎంతో వైభవంగా జరుగుతున్న విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమాలను విజయవంతం చేసిన వినాయక నగర్ కాలనీ వాసులకు మరియు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వినాయక నగర్ దేవస్థాన కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పూజారులు పాలా గణపతి శర్మ, పాలా సదాశివశర్మ, జయప్రకాష్ శర్మ, శివ ప్రసాద్ శర్మ, వినాయక నగర్ దేవస్థాన కమిటీ సభ్యులు లింగాల మధుసూదన్ రెడ్డి, కందుల వెంకట్ రెడ్డి, పాక లక్ష్మయ్య, వరికుప్పల శ్రీనివాస్, వరికుప్పల పాండు, తోటపల్లి కిరణ్, తోటపల్లి శ్రీనివాస్, మేదరి శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, తోటపల్లి నాని, జబ్బు అంజయ్య, జంగయ్య, పాక రామకృష్ణ మరియు పూజలలో పాల్గొనే దంపతులు భక్తులు పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు