శ్రీ వెంకటేశ్వర గొర్రెల మేకల పెంపకం దారుల సహకార సంఘం నూతన కమిటీ ఎన్నిక
దండేపల్లి. జనంసాక్షి.అక్టోబర్2 శ్రీ వెంకటేశ్వర గొర్రెల, మేకల పెంపకదారుల సహకార సంఘం కార్యవర్గాన్ని ఆదివారం మండల కేంద్రం ఎన్నుకున్నారు. చైర్మన్ గా అల్లంల కుమారస్వామి యాదవ్,ప్రధాన కార్యదర్శిగా గొట్ల శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు గస గడ్డి తిరుపతి యాదవ్, డైరెక్టర్లుగా నానవేని సత్తయ్య, గొట్ల మల్లేష్ యాదవ్ , మహిళ డైరెక్టర్లుగా బైరి లచ్చవ్వ, గొట్ల మల్లవ్వ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ కుమారస్వామి యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్మన్ గా ఎన్నుకున్న సభ్యులకు,కులస్థులకు ధన్యవాదాలు తెలిపారు.