షణ్ముఖ ప్రియను నిరాశ పర్చిన ఇండియన్‌ ఐడోల్‌


విజేతగా నిలిచిన పవన్‌దీప్‌ రాజన్‌
ముంబై,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌`12లో మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం ఆరుగురు ఫైనల్‌కు చేరగా.. ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్‌ రాజన్‌ విజేతగా నిలిచారు. రెండోస్థానంలో అరుణిత కాంజీలాల్‌, మూడోస్థానంలో సయాలీ కాంబ్లే, నాలుగోస్థానంలో మహ్మద్‌ దానిష్‌, ఐదో స్థానంలో నిహాల్‌ తౌరో నిలిచారు. విజేతగా నిలిచిన పవన్‌దీ?ప రూ.25 లక్షల నగదు, మారుతి సుజుకీ స్విప్ట్‌ కారు గెలుచుకున్నాడు. దాదాపు 12 గంటలపాటు జరిగిన గ్రాండ్‌ ఫినాలే వేడుకలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.