షర్జీల్ ఖాన్ పై ఐదేళ్ల నిషేదం
-స్పాట్ ఫిక్సింగ్ లో దోషిగా తేలిన పాక్ క్రికెటర్
లా¬ర్,ఆగస్టు30 : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మరోసారి పాకిస్థాన్ నిలిచింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడిన ఓపెనర్ షర్జీల్ ఖాన్‌పై పాక్ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ ఐదేళ్ల నిషేధం విధించింది. ఇదే కేసుకు సంబంధించి త్వరలోనే ఖలిద్ లతీఫ్ భవితవ్యాన్ని కూడా ఈ ట్రిబ్యునల్ తేల్చనుంది. దుబాయ్‌లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ రెండో రోజే షర్జీల్, ఖాలిద్‌లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ ఇంటికి పంపించేశారు. దీనిపై మంగళవారమే పూర్తి ఆధారాలతో తమ వాదనలను పాక్ క్రికెట్ బోర్డు పూర్తి చేసింది. షర్జీల్, అతని లాయర్ ట్రిబ్యునల్ తీర్పును గౌరవించగా.. ఖలిద్ మాత్రం ఈ ట్రిబ్యునల్‌కు ఉన్న రాజ్యాంగబద్ధతను ప్రశ్నించాడు. స్పాట్ ఫిక్సింగ్‌లో ఇరుక్కొని నిషేధాలు ఎదుర్కోవడం పాక్ క్రికెటర్లకు ఇది కొత్తేవిూ కాదు. గతంలో కెప్టెన్‌గా ఉన్న సల్మాన్ బట్‌తోపాటు పేస్ బౌలర్లు మహ్మద్ ఆమిర్, మహ్మద్ ఆసిఫ్‌లపై కూడా 2011లో ఐదేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2012లో లెగ్ స్పిన్నర్ డేనిష్ కనేరియాపై జీవితకాల నిషేధం విధించారు.