షర్మిలకు తెలంగాణ సెగ : వైయస్సార్సీపి దాఢి; ఉద్రిక్తత
మహబుబ్‌నగర్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్రను శనివారం మహబుబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది.మహబుబ్‌నగర్ జిల్లాలోని శాంతినగర్ వద్ద షర్మిల పాదయాత్రను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తెలంగాణవాదులపై దాడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జై తెలంగాణ నినాదాలు చేస్తూ తెలంగాణపై షర్మిల తన స్పష్టమైన వైఖరి చెప్పాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. తెలంగాణవాదులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల దాడికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విద్యార్థి విభాగం (టీఅర్‌ఎస్వీ) కార్యకర్తలు మహబుబ్‌నగర్ జిల్లాలోని ఐజలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలు అగిపోయాయి. తెలంగాణవాదులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల దాడిని టీఅర్‌ఎస్వీ అధ్యక్షుడు సుమన్ ఖండించారు.షర్మిల తప్పకుండా తెలంగాణ అనాల్సిందేనని తెలంగాణపై షర్మిల స్పష్టమైన వైఖరి చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు. తెలంగాణ వాదులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల దాడిని తెలంగాణవాదంపై దాడిగా పరిగణిస్తామని అయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడిలో షర్మిల తెలంగాణకు వ్యతిరేకమని తెలిపోయిందని అయన అన్నారు. కాగా తన పాధయాత్రలో షర్మిల కాంగ్రెసు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని అమె అన్నారు. వైయస్ జగన్‌ను అనవసరంగా జైలులో పెట్టారని అమె అన్నార