షర్మిల కు వినతిపత్రం అందజేసిన తెలంగాణ దండోరా నాయకులు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 7 (జనంసాక్షి):
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చేరింది.ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రాము మాదిగ ఆధ్వర్యంలో షర్మిల కు వివిధ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ మాట్లాడుతూ మార్చి నెల 1నుండి నాగర్ ర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలుకనుండి మాదిగ వాడ లోని పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, కొల్లాపూర్ తాలూకాలోని అన్ని గ్రామాలలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మాదిగ లకు సంబంధించిన ఇనాము భూములు కానీ మరియు లవాణ్ పట్టగాని అలాగే పోరంపోగు భూమి గాని ఇప్పటివరకు శాశ్వత పట్టా ఇవ్వకుండా ప్రభుత్వాధికారులు తాత్సారం చేస్తున్నారని షర్మిలకు వివరించారు.గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 1970సంలోఇచ్చిన భూమిని కూడా మళ్ళీ లాక్కుంటున్నారని అన్నారు. మాదిగ లకు ఇచ్చిన భూమి లో స్మశాన వాటికలు మరియు పల్లె ప్రకృతి వనం పేరుతో లాక్కుంటున్నారని అన్నారు. మాదిగలకు శాశ్వత పట్టా ఇవ్వాలని తెలంగాణ దండోరా తరఫునుంచి గుర్తు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మరి రాములు మాదిగ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జి మంతటి గోపి మాదిగ నాగర్ కర్నూల్ సీనియర్ నాయకులు సుక్క వెంకట స్వామి తాలూకా అధ్యక్షుడు కేశంపేట రాములు రాజ గోపాల్ బీమయ్య శ్రీను మదు తదితరులు పాల్గొన్నారు