షో రూమ్ ని ప్రారంభోత్సవం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి
దేవరకొండ పట్టణంలో బజాజ్ బైక్స్ షో రూమ్ ని ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ .అనంతరం బైక్ కొనుగోలు చేసిన వాహనదారునికి బైక్ కీ అందజేసి తప్పకుండా హెల్మెట్ ధరించి డ్రైవ్ చేయాలని ,వేగం కన్నా ప్రాణం మిన్న అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహ ,ఎంపిపి జానీ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్, తదితరులు కూడా పాల్గొన్నారు.