సంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అమృత్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ.

తాండూరు సెప్టెంబర్ 30(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంకిరెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ అమృత్ రెడ్డి మాతృమూర్తి పట్లోళ్ళ రాధమ్మ  గురువారం అకాల మరణం చెందారు.విషయాన్ని తెలుసుకొనున్న మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి శుక్రవారం అమృత్ రెడ్డి  మరియు వారి కుటుంబ సభ్యులకు పరామర్శిం చి మనోధైర్యం కల్పించారు.ఎమ్మెల్సీ వెంట
తాండూర్ మండల పిఎసిఎస్ చైర్మన్ రవి గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ ,పిఎసిఎస్ చైర్మెన్ విష్ణువర్ధన్, నాయకులు గౌడి వెంకటేష్, శ్రీకాంత్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, తదితరులు గ్రామస్తులు హాజరయ్యారు.

Attachments area