సంక్రాంతికి వెలుగొండ నుంచి మంచినీళ్లు విడుదల

ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రులు

ఒంగోలు,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): సంక్రాంతి నాటి నుంచి వెలుగొండ ప్రాజెక్టు ఒకటో సొరంగం నుంచి నీళ్లు విడుదల చేస్తామని మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. మంత్రులు శిద్దా రాఘవరావు, నారాయణ వెలుగొండ ప్రాజెక్టును మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్ధా విూడియాతో మాట్లాడుతూ రోజుకు 20 విూటర్ల చొప్పున సొరంగం తవ్వకం జరుగుతుందన్నారు. ఇంతవరకు ఒకటో సొరంగం 15.1 కి.విూ. పూర్తయిందని మంత్రి తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తామన్నారు. కొత్త గుత్తేదారుపనులు ప్రారంభించారని నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కరణం బలరాం, మాగుంట శ్రీనివాసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలావుంటే దేశ ప్రజలకు ఇచ్చిన హావిూలు నెరవేర్చడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంత్రి విమర్శించారు. స్వాతంత్య దినోత్సవం రోజైనా మోదీ నిజాలు మాట్లాడాలని అన్నారు. మోదీ పాలనలో దేశం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి విమర్శించారు. ఆర్ధిక నేరస్తులు విదేశాలకు పారిపోతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. విదేశాల నుంచి బ్లాక్‌మనీ తెస్తామన్న హావిూ ఏమైందని మంత్రి నిలదీశారు. ప్రచార అర్భాటం కోసం నాలుగేళ్ళలో మోదీ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.

 

తాజావార్తలు