సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ఏడు ప్రత్యేక రైళ్ల

సికింద్రాబాద్‌ : సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణీకుల సౌకర్యం కోసం ఏడు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. జనసాధారణ్‌ పేరుతో ఈ రైళ్లను ఆయా రూట్లలో నడపనున్నారు. హైదరాబాద్‌-విజయవాడ, సికింద్రాబాద్‌-విజయవాడ, తిరుపతి-కాకినాడల మధ్య ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ పేర్కొన్నారు. మరోవైపు పండగ డిమాండ్‌ను అధిగమించేందుకు మరికొన్ని రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండగకు ఇళ్లకు చేరేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో చేరుకుంటుండటంతో ప్రధాన రైల్వేస్టేషన్లు ప్రయాణీకులతో కిక్కిరిశాయి.