సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలి

నిజామాబాద్‌, మే 26 (జనంసాక్షి): ప్రజలు సంతోషించేవిధంగా ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి, నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే వరకు గ్రామ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అందించి ఆదుకోవాలని రాష్ట్ర భారీ మధ్యతరహా నీటి పారుదల శాఖ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక అధికారులను, తహశీల్దార్లను, ఎంపిడివోలను ఆదేశించారు. శనివారం స్థానిక ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వారాంతపు సమీక్ష సమావేశంలో అధికారులను ఉద ే్దశించి మాట్లాడారు.ఈ సందర్భంగామంత్రి మాట్లా డుతూ ప్రధానంగా రైతుల భూములను సారవంతంగా తీర్చిదిద్ద డంలో పాటు కూలీలకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చాలని తెలిపారు. పదవ తరగతి ఫలితాల సాధనలోవెనుకబడిపోయమని, లోటు పాట్లను సరిదిద్దు కుంటూ విద్యా ర్థి సామర్థ్యం పెంచాలని, పూర్వవైభవం తేవాలని సూచించారు. వర్షా కాలం సమీపిస్తున్నందున నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుం టూ క్లోరినేషన్‌ చేయాలని, డయోరియా ప్రబలకుండా చర్యలు తీసు కోవాలని, వైద్యఆరోగ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని, పారిశుద్యాన్ని మెరగు పర్చాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ వరప్రసాద్‌ మాట్లా డుతూ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు మేలు చేకూరేలా యంత్రాంగం కృషి చేస్తుందని, సకాలంలో ఫలితాలు సాధించి నిర్దేశించిన లక్ష్యాలు నెరవేర్చటానికి ఎళ్లవేళలా కృషి చేస్తామని తెలిపారు. మంచినీటి కొరతను అధికమించటానికి 15.43 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున 1478 బోరుబావులను శుభ్రపరిచి లోతు పర్చటం, 432 చోట్ల రవాణా ద్వారా మంచినీరు సరఫరా చేయడం, వ్యవసాయ బావులను అద్దెకు తీసుకోవడం జరిగిందని, సిఆర్‌ఎఫ్‌, నాన్‌ సిఆర్‌ఎఫ్‌ కింద 775 పనులను చేపట్టి అవసరమైన చోట బోరుబావుల వేయటం, అదనపు పైప్‌లైన్లు అందించడం, ఇతర పనులు పూర్తి చేయటం జరుగుతుందని తెలిపారు. సహకార సంఘాలను బలోపేతం చేసి 1.85 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని, 200 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఉపాధి హామీ పథకంకింద సారవంతమైన మట్టిని రైతులు తమ పొలాలకు ఉచితంగా తీసుకవెళ్ళడానికి మరింత ప్రోత్సాహం అందించాలని అధికారులను ఆదేశించారు.

రైతు చైతన్య యాత్రలో ఆధునిక వ్యవసాయ పద్దతులపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీ పారిశుద్ద్య కార్మికులకు మేజర్‌ గ్రామ పంచాయతీ అయినట్లయితే 1200 రూపాయలు,చిన్న గ్రామ పంచాయతీ 750 రూపాయల వేతనాన్ని పెంచాలని సూచించారు. రేషన్‌ కార్డులలో లోపాలను సరి చేసిఅర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డు అందించాలని, మ్యూటేషన్‌ పూర్తి చేయాలని తెలిపారు. నిరుపేదలు మిగిలి ఉన్నట్లైతే ఎఎవై కింద అన్నపూర్ణ కింద మిగులు ఉన్న 10 వేల కార్డులను అందించాలని సూచించారు.

పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ కొరకు ఇప్పటి వరకు వెయ్యి ఎకరాలు సేకరించి 30వేల ఇండ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కొత్తగా అర్హులైన పేదలకు ఇళ్లస్థలాల పట్టాలు పంచటానికి అవసరమైన నిధులు దాదాపు 7 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని, భూసేక రణ త్వరగా జరిపి లబ్దిదా రులకు పట్టా సర్టిఫికెట్లు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ హర్షవర్ధన్‌, అద నపు జేసీి శ్రీరాంరెడ్డి, డిఆర్‌ ఓ జగదీశ్వరాచారి, జడ్పీ సీఈవో కృషా ్ణరెడ్డి, డీపీిఓ సురేష్‌బాబు, సీపీవో నబీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ ఇంద్రసేన్‌,ఐకెపి పిడి వెంకటేశం, డ్వామా పిడి వీరాచారి, భూ సేకరణ డిప్యూటి కలెక్టర్‌ సుధాకర్‌రెడ్డి, ఆర్డీవోలు హన్మంత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.