సంక్షేమ పథకాలే తెలంగాణ స్పెషల్
కాంగ్రెస్ వీటిని ఎందుకు అమలు చేయలేదు :ఆరూరిరమేశ్
వరంగల్,సెప్టెంబర్30 (జనంసాక్షి): వర్ధన్నపేట నియోజవర్గం అభివృద్దికి అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అండదండలతో అభివృద్దిలో ముందున్నామని చెప్పారు. ప్రధాన సమస్యలను కేసీఆర్ ,కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడుతనని తెలిపారు. బతుకమ్మ పండగ సందర్భంగా ఆయన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. గత ఎన్నో ఎండ్లా పాటు అనేక రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా,ఎవరు కూడా కులవృత్తులకు పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 ,వికలాంగులు500 పెన్షన్ లు ఉండేవి కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 1000,1500 లకు పెంచారు. ఎన్నికల్లో హావిూలు ఇవ్వని అనేక సంక్షేమ పథకాలు కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ ,చెక్కుల పంపిణీ చేస్తుంది. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ కి సోయ్ ఉందా అని అన్నారు..రెక్కాడితే కాని డొక్కాడని నిత్యం పని చేసుకొని వారి కోసం అనేక పథకాలు అందిస్తుంది.కేసీఆర్ కిట్ లతో పాటు ఉచిత డెలివరీ,డబ్బులు కూడా ఇస్తున్న ప్రభుత్వం
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. ప్రతి పేద విద్యార్థుల కోసం అనేక గురుకుల పాటశాల ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య,సన్నబియ్యం పెడుతున్న ప్రభుత్వం తమదని అన్నారు. ఆడపిల్లల కోసం ప్రత్యేక హైజానిక్ కిట్ ల పంపిణీ,అంతేకాక కంటి పరీక్షలు ద్వారా కంటి వెలుగులు అందిస్తున్నాం అని అన్నారు. ప్రతి ఇంటికి గోదావరి నీళ్లను అందించేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం చేస్తుంది. సుమారు 415 సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్‌దని అన్నారు. .తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉచిత విద్యుత్ 24 గంటల పాటు ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అంతే కాక బ్యాంక్ రుణమాఫీ ,పెట్టుబడి కోసం పెట్టుబడి చెక్కుల పంపిణీ తో పాటు రైతులు ప్రమాదాలు జరుగుతే 5లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. .అన్ని గ్రామాల్లో అంతర్గత సి సి రోడ్లను నిర్మించాడని ప్రయత్నం చేస్తున్నాం.ఆకేరు వాగు పై నందనం , ఇల్లంద,కొత్తపల్లి కొత్త చెక్ డ్యామ్ ల నిర్మాణం కోసం కృషి చేస్తున్నానని అన్నారు. అభిశృద్దిలో తెలంగాణ దూసుకుపోతుంటే కాంగ్రెస్ విమర్శల్లో ముందన్నదని ఎద్దేవా చేశారు.