*సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శం*

మక్తల్ ఆగస్టు 29 (జనంసాక్షి)
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.  ఆదివారం మండలంలోని జక్లేర్ గ్రామంలో లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్  ధ్రువపత్రాలు అందించి మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలుచేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలు అమలు చేసి దేశంలో నే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది అన్నారు. ప్రజల ఆశీర్వాదం నిండుగా ఉన్న కేసీఆర్ ను ఏ రాజకీయ శక్తి అడ్డుకోజాలదన్నారు. అన్నారు. ఈ సందర్భంగా గుడిగండ్ల, జోలపురం, మాదన్ పల్లి, బొందల్ కుంట, కాచ్వార్ గ్రామాల లబ్ధిదారులకు కూడా కొత్త పెన్షన్ మంజూరి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్, ఎంపీపీ వనజ దత్తు, ఎంపీడీవో శ్రీధర్,  సర్పంచులు బి నర్సింలు, ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీలు పారిజాత, లక్ష్మి నర్సిరెడ్డి, బలరాంరెడ్డి ఉపసర్పంచ్ సంగీత  గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు,  పాల్గొన్నారు.