సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలి
నర్సంపేట, జూన్ 16(జనంసాక్షి) :
సంక్షేమ వసతిగృహాల సమస్యలను పరిష్కరించాలని ఏబీఎస్‌ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు బొట్ల నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నర్సంపేట పట్టణంలో ఆసంఘం డివిజన్ కమిటీి ప్రతినిధి బృందం సంక్షేమ హాస్టళ్లను సందర్శించింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌లోని వివిధ సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా సంక్షేమ హాస్టళ్లలో మౌళిక వసతులు కల్పించి విద్యార్థుల విద్యాభివృద్ది కోసం కృషి చేయాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఆసంఘం నాయకులు వంశి, శ్రీను, రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.