సంగారెడ్డి జిల్లా కోత్లాపూర్ లో 250 ఎకరాల కబ్జా.
— రోడ్డున పడ్డా బాధితులు.
— పట్టించుకోని అధికారులు, నాయకులు.
సంగారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 27:(జనం సాక్షి): సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామంలోని 146 సర్వే నంబర్ లోని దాదాపు 250 ఎకరాల అసైన్డ్ భూమిని దాదాపు 50 సంవత్సరాల పైగా కబ్జాలో ఉన్న హక్కుదారులను మోసం చేసి, తమ భూములలో కార్ల కంపెనీ పెడతారని, వాళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి వారి జీవన ఆధారమైనటువంటి భూమిని బలవంతంగా లాక్కున్నారు, దీనిపై హక్కుదారులు 2017 నుండి నిరంతరంగా పోరాడుతున్న వారికి ఫలితం లేకపోయింది కలెక్టర్ దగ్గరికి వెళ్లిన తహసిల్దార్ దగ్గరికి వెళ్లిన వారి మనోవేదనను ఆలకించే నాథుడే లేడు. వారి సమస్యకు తీన్మార్ మల్లన్న సరైన పరిష్కారం చూపుతారని వారు సంగారెడ్డి జిల్లా తీన్మార్ మల్లన్న ఆశ్రయించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ వారికి తగిన న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గం అధ్యక్షుడు నవీన్ యాదవ్, సభ్యులు శరత్ కుమార్, రైతులు బొప్పే పద్మారావు, బక్కని బాలయ్య, బొప్పే మోష, అంతగిరి లింగం గౌడ్, కర్రోళ్ల పద్మయ్య, బొప్పేశామల తదితరులు పాల్గొన్నారు.