సంగారెడ్డి జైలుకు అక్బరుద్దీన్ తరలింపు
ఆదిలాబాద్: కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి సంగారెడ్డి కోర్టుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో అక్బరుద్దీన్ రిమాండ్ నేటితో ముగియనుండటంతో సంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి ముందు ఆయన్ను పోలీసులు హాజరుపరచనున్నారు. ఇదే కేసులో అక్బర్ సోదరుడు అసదుద్దీన్ అరెస్టయి బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.