సంగీత జగత్తులో రారాజు ఎస్పీ బాలు
డిఎస్వీ శర్మ
సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి ):50 వసంతాల పాటు 40 వేలకు పైగా మధురమైన పాటలను పాడి భారతీయ సంగీత ప్రియుల గుండెల్లో కలకాలం నిలిచిపోయిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అని మంత్రి జగదీష్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి డిఎస్వీ శర్మ అన్నారు.ఆదివారం ఎస్పీ బాలసుబ్రమణ్యం ద్వితీయ వర్ధంతి సందర్భంగా జిల్లా బాల భవన్ లో శ్రీ జ్ఞాన సరస్వతి సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో బుర్రి వెంకటేశ్వర్లు సౌజన్యంతో స్వరనీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్వీ శర్మ మాట్లాడుతూ మరువలేని మధుర గాయకుడు ఎస్పీ బాలు అని కొనియాడారు.అనంతరం బాలు పాడిన పాటలను పలువురు ఆలపించారు.ఈ కార్యక్రమంలో బాల భవన్ సూపరింటెండెంట్ రాధాకృష్ణారెడ్డి , రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుండా రమేష్ , హరికృష్ణ , లక్ష్మి , అబ్రహం, సైదులు, అంజన్ ప్రసాద్ , హమీద్ ఖాన్ వీరు నాయుడు, చలమందరావు తదితరులు పాల్గొన్నారు.
Attachments area