సంజీవయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: రావెల

హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఎల్బీస్టేడియం సవిూపంలో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు, కాంగ్రెస్‌ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు సంజీవయ్య విగ్రహం వద్ద నివాళులర్పించి ఆయన సేవలను కొనియడారు. ఏపీ మంత్రి రావెల మాట్లాడుతూ… దామోదరం సంజీవయ్య జయంతి ఉత్సవాలను కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడం సంతోషంగా ఉందన్నారు. సంజీవయ్య ఆశయాలను దళిత నేతలు ఆదర్శంగా తీసుకోవాలని.. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడాలని అన్నారు. ప్రతి ఒక్క దళితుడు సంజీవయ్యను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.