సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి):సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ మైలారిశెట్టి సైదారావు అన్నారు.బతుకమ్మ సంబరాలను ఆ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే పూలను పూజిస్తామన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూజిస్తూ తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని కొనియాడారు.
బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం పెతర అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తాయన్నారు.ఈ సంబరాల్లో భాగంగా విద్యార్థులు బతుకమ్మ పాటలతో ఆడారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాణి, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.