సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక
ఖండాంతరాలకు విస్తరించిన ప్రకృతి ఆరాధన
బతుకమ్మ తో విశ్వవ్యాప్తిమైన తెలంగాణ సంస్కృతి
సీఎం కేసీఆర్ హయంలోనే అధికారికంగా నిర్వహణ
కోటి మంది ఆడ పడుచులకు 350 కోట్లతో బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ
శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలి
– మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ( జనంసాక్షి): సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పర్వదినం పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకంట్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు.ఆదివారం పెత్ర అమవాస్యతో మొదలయ్యే బతుకమ్మ ఉత్సవాలతో పాటు దేవి శరన్నవరాత్రోత్సావాలు ఘనంగా జరుపుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణా ఉద్యమంతో ఖండాంతరాలకు విస్తరించిందని చెప్పుకొచ్చారు.అందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ ప్రాశస్త్యాన్ని ఉద్యమ సమయంలో ముందుకు తేవడమేనని కొనియాడారు.అందుకే వచ్చిన తెలంగాణలో అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ హయాంలోనే మొట్టమొదటి సారిగా బతుకమ్మ పర్వదినాన్ని అధికారికంగా జరుపుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరల పంపిణీని చేపట్టినట్లు తెలిపారు.మహిళల పట్ల సీఎం కేసీఆర్ కున్న ఆదరాభిమానాలకు ఇది చక్కటి ఉదాహరణగా చెప్పారు.ఈ బతుకమ్మ పర్వదినోత్సవ సందర్భంగా కోటి మంది ఆడ పడుచులకు రూ.350 కోట్లతో బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసినట్లు ప్రకటించారు.