సచివాలయం వద్ద రోడ్డు ప్రమాదం
హైదరాబాద్, జనంసాక్షి: సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఓ వాహనం అదుపు తప్పి బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రధాన ద్వారం వద్ద పలువురు భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఐ అండ్ పీఆర్ విశ్రాంతి డైరెక్టర్ కృష్ణారావు కారులో సచివాలయానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వృద్ధాప్యం కారణంగా ఆయనకు బీపీ ఒక్కసారిగా పెరగడంతో ఆయన కారును అదుపు చేయలేకపోయారు. అదుపుతప్పిన కారు బారికేడ్లను ఢీకొని ముందుకెళ్లి భద్రతా సిబ్బందికి తగలడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి.