సడక్ బంద్‌పై వెనక్కు తగ్గం
కోదండరామ్
అక్రమ కేసులపై హోంమంత్రికి ఫిర్యాదు
అనుమతి లేదంటున్న పోలీసులు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః
సడక్ బంద్ లడాయి మొదలయ్యింది. సడక్ బంద్ నిర్వహించి తీరుతామని జెఎసి ప్రకటించగా అనుమతి లేదంటూ పోలీసులు ప్రకటించారు. మరోవైపు సడక్‌బంద్‌కు మద్దతుగా టిఆరెఎస్ ఎమ్మెల్యేలు పాలమూరుకు బస్సుయాత్ర చేపట్టారు. అక్రమ కేసులపై స్పందించాలని అంతకుముందు ¬ంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలసి విన్నవించారు. ఈ 24న శంషాబాద్ విమానాశ్రయ మార్గంలో సడక్‌బంద్ నిర్వహించాలని తెలంగాణ ఐకాస నిర్ణయించింది. 10 వేలమందితో శంషాబాద్ వద్ద కర్నూలు జాతీయ రహదారిని నిర్బంధిస్తామని ఐకాస ఛైర్మన్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. యూపీఏ సర్కారు తెలంగాణపై మాట తప్పడం వల్లే మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తెలంగాణ సెగ తగిలేలా సడక్ బంద్ నిర్వహించాలని తెరాస నేత హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్ నగర్‌లో మాట్లాడుతూ కేసులు పెట్టి జైల్లో పెడితే గర్వపడతామే తప్ప సిగ్గుపడం అన్నారు. విధ్వంసం, హింస తమ లక్ష్యం కాదని, అనుమతిస్తే ప్రశాంతంగా సడక్ బంద్ నిర్వహిస్తామని హరీశ్‌రావు అన్నారు. బైండోవర్ కేసులు పెట్టి అడ్డుకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని టీఆర్‌ఎస్ ఎల్‌పీ నేత ఈటెల రాజెందర్ హితవు పలికారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా సడక్ బంద్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. బైండోవర్ కేసులతో ప్రభుత్వం తెలంగాణ ప్రజలను భయాందోళనకు గురిచేయాలని చూస్తుందని ఈటెల అన్నారు. తెలంగాణ ప్రజలకు నిర్భందాలు కొత్తకాదని స్వరాష్ట్రం సాధించుకునే వరకు మడమ తిప్పమని తెలిపారు. సడక్ బంద్‌లో అనుకోనిది జరిగితే తెలంగాణ ప్రాంత మంత్రులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రబుత్వం కావాలనే నిర్బంధం కొనసాగిస్తోందని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్ని అవాంతరాలు పెట్టినా తాము శాంతియుతంగా కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అంతకుముందు¬ం మంత్రిని కలసిన తెరాస ఎమ్మెల్యేలు వేధింపులు, కేసులపై ఆమెకు వివరించారు. ఈ నెల 24న తలపెట్టనున్న సడక్ బంద్ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా వాసులను పోలీసులు వేధిస్తున్నారంటూ తెరాస ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులు జాతీయ రహదారి పైనవిధుల్లో ఉండి స్థానికులను బైండోవర్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిపై సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఎమ్మెల్యేలకు హావిూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, హరీశ్వర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, సమ్మయ్య, ఓదేలు, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కేసులపై అడ్వకేట్ జేఏసీ ఆగ్రహం
సడక్ బంద్ సందర్భంగా తెలంగాణవాదులపై అక్రమ కేసులు నమోదు చేయడంపై టీ- అడ్వకేట్ జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని న్యాయవాదులు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 28లోగా నివేదిక ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీని హెచ్‌ఆర్సీ ఆదేశించింది.
సడక్ బంద్‌కు అనుమతి లేదు : డీఐజీ నాగిరెడ్డి
ఈనెల 24న తెలంగాణ జేఏసీ నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్‌కు అనుమతి లేదని డీఐజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం విూడియాతో మాట్లాడుతూ సభలు,ర్యాలీలు, సమావేశాలు నిర్వహించవద్దని, రహదారిని దిగ్భంధిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు- తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే 1512 మందిని బైండోవర్ చేసినట్లు- డీఐజీ నాగిరెడ్డి తెలిపారు