సత్ఫలితాలు ఇస్తున్న తొలిమెట్టు మెటీరియల్ బోధన
*జిల్లా విద్యాధికారి రమేష్ తూప్రాన్ జనం సాక్షి నవంబర్ 25:: చదువు రా నీ చదవలేని వారికి తొలిమెట్టు ద్వారా మెటీరియల్ తో బోధిస్తే చక్కటి ఫలితాలు వస్తున్నాయని జిల్లా విద్యాధికారి రమేష్ పేర్కొన్నారు మనోహరాబాద్ మండలంలోని కళ్ళకల్ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పై మండలంలోని ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు రూపొందించిన లెర్నింగ్ మెటీరియల్ ప్రదర్శన ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల విద్యార్థులు ఎలాంటి చదువు లేకుండా అని రెండు సంవత్సరాలు ఉత్తీర్ణులయ్యారని ఆ తర్వాత వారికి రెండు సంవత్సరాల మధ్య గల చదువును చెప్పించడానికి తొలిమెట్టు ప్రయోగాత్మకంగా విజయవంతం అయిందని అన్నారు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు లెర్నింగ్ మెటీరియల్ ఫౌండేషన్ పాఠాలు గణిత పాఠాలు ఎంతో ఉపయోగం పడ్డాయని ఈ ప్రదర్శనలు 5 00 లెర్నింగ్ ప్రదర్శనలు అందరినీ ఆకర్షిస్తున్నాయని అన్నారు ప్రతి విద్యార్థి రాయడం చదవడం లెక్కల స్కిల్ చేయగలిగాలని మొదటగా విద్యార్థి ప్రతిభ కనబరచాలని అన్నారు చదువులో వెనుకబడిన వారిపై దృష్టి పెడితే ఈ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని దీనితో 100% ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉన్నాయని అన్నారు తొలిమెట్టు బోధనలు ఉపాధ్యాయులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ విద్యార్థులను మంచి విద్యావంతులుగా తయారు చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు ప్రతి మండలంలో తొలిమట్టి మేళాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు జిల్లాలో 1770 మంది ఉపాధ్యాయులు తొలిమెట్టు శిక్షణ పొందాలని ఢిల్లీ ప్రదర్శనలు తెలంగాణ తొలి మెట్టు పై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యావంతులు ప్రశంసించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీత రవి సర్పంచ్ నత్తి మల్లేష్ ఎంపీటీసీ లావణ్య ఎంఈఓ యాదగిరి సెక్టోరియల్ అధికారి సుభాష్ ప్రధానోపాధ్యాయులు వెంకటస్వామి మాజీ సర్పంచ్ కాళిదాసు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు