సత్యం ధర్మాలను వీడడం వల్ల్నే ఉపద్రవం
తిరుపతి,ఆగస్ట్5( జనంసాక్షి): మహాభారతంలోని ఉద్యోగ పర్వంలోసత్యం, ధర్మం తెలిసి కూడా ఆచరణలో పెట్టలేని కౌరవులకు మళ్లి ఒకసారి గుర్తు చేయడానికే కూర్చబడినట్టు పండితులు చెబుతారు. కృష్ణపర మాత్మ కౌరవ పాండవుల మధ్య సంధి చేయ కౌరవ సభకు వచ్చి యుద్ధం నివారింపబడాలని చెబుతూ పాండవులు అయిదుగురికి ఐదు ఊర్లు ఇచ్చినా సంతృప్తిపడ తారని కౌరవులకు నచ్చజెప్ప ప్రయత్నించాడు. అయినా కౌరవులు పరమాత్ముని వచనాలు పెడచెవిన బెట్టడమేగాక కృష్ణ భగవాణున్ని సామాన్యునిగా భావించి బంధించ ప్రయత్నించారు. అసత్యపరులు అహంకారులు తనను తెలుసుకోలేని అజ్ఞానులని భావించిన భగవానుడు తన విశ్వ రూపాన్ని ప్రదర్శించి తనెవరో తెలియజేసాడు. ప్రస్తుత కాలంలో విజ్ఞానపరంగా మనం ఎంతో అభివృద్ధిని సాధించాం. సాధిస్తున్నాం కూడా! కానీ సత్యం, న్యాయం, ధర్మం వంటి వాటిపై శ్రద్ధ చూపడం లేదనేది ముమ్మాటికి నిజం. సత్య ధర్మాలపై అశ్రద్ధ కారణంగానే మనం ప్రకృతి వైపరీత్యా లకు గురవుతున్నాం. ప్రాణాలను పణంగా పెట్టుకుంటున్నాం. ఇకనైనా మనం మేలుకొని సత్యంతో కూడిన ఆలోచనలు, ఆచర ణలు ఆచరించ ప్రయత్నిద్దాం. సత్యంలోనే భగవంతుడున్నాడని నమ్ముదాం. అన్నింటిలో సత్యవాదులవుదాం.