సదాశివనగర్ మండలం లింగంపలల్లి పాఠశాల మీదుగా ఉన్న యల్‌టీ కరెంటు వైర్లను తొలగించాలని డిమాండ్
గ్రామానికి పరామర్శకు వెల్లిన యంయల్‌ఏ జాజాల సురేందర్ ద్రుష్టికి తసుకువచ్చిన గ్రామస్తులు గత మూడేళ్లుగా ఈ సమస్య ఉందని ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని అన్నారు వెంటనే స్పందించిన యంయల్ఏ అధికారుల పై మండిపడి ఈ బాధ్యతను మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు కి అప్పగించారు యంయల్ఏ ఆదేశాలతో గ్రామ సర్పంచ్ సాయిలును తీసుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఈ ఆఫీసులో ఏఈ నాగేశ్వరరావును కలిశారు ఈసందర్భంగా మాజీ జెడ్పిటిసి మాట్లాడుతూ గత మూడేండ్లు గా ఈ సమస్య ఉందని అధికారులకు తెలుపారు తెలుపగా ఏఈ స్పందించి జూలై నెలాఖరులో గా ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తొలగిస్తామని తెలిపారు ఇందుకు సంబంధించిన నివేదికను రేపటినుండి తయారు చేయించి అవసరమైన సామాగ్రిని తెప్పించి పనులు ప్రారంభిస్తామని చెప్పారు!
అలాగే గ్రామానికి మంచినీటిని అందించే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి మూడు రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని తెలుపగా ఇరవై నాలుగు గంటల్లో ట్రాన్స్ఫార్మర్ పెట్టిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సింగిల్ విండో చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి పాల్గొన్నారు