సన్నాలకే బోనస్‌ సరికాదు

` వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్న ధాన్యం కొనుగోళ్లలో కదలని అధికారులు
` బీఆర్‌ఎస్‌ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట(జనంసాక్షి): తుఫాన్‌ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల వడ్లు తడిచే అవకాశం ఉందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి విూడియాతో మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పంట పండిరచిన రైతులు కల్లాల్లో పడిగాపులు కాచే పరిస్థితి ఏర్పడిరదని అన్నారు. తడిసిన వడ్లతో సహా అన్ని వడ్లను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉందన్నారు. చిన్నకోడూరు కేంద్రాల్లో రైతులు 20 రోజులుగా వేచి చూస్తున్నారని చెప్పారు. ధాన్యం ఒకటికి రెండుసార్లు తడిసి మొలకెత్తింది. ధాన్యం రైస్‌ మిల్లుకు వెళ్లాక తేమ శాతం ఎక్కువ ఉందని, మొలకెత్తిందని కొనడం లేదని పేర్కొన్నరు. ఒక వేళ కొన్నా తరుగు తీసేయడం వల్ల సంచికి మూడు కిలోలు కోతపెట్టే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. తరుగు లేకుండా వెంటనే వడ్లు కొనాలని డిమాండ్‌ చేశారు. చిన్నకోడూరు రైతులతో మాట్లాడినప్పుడు ఇంటి అవసరాల