సన్‌రైజర్స్ విజయ లక్ష్యం 124 పరుగులు
హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఈ జట్టులో గిల్‌క్రిస్ట్ 26, పీయూష్ చావ్లా 23, హాస్సి 22పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో కరణ్ శర్మ ,ఇషాంత్ శర్మ రెండేసి వికెట్లు తీయగా స్టేయిన్ ఒక వికెట్ తీశారు.