సబిత, ధర్నాన జ్యుడీషియల్ కస్టడీ కోసం కోర్టులో సీబీఐ
మెమో
హైదరాబాద్ : మాజీ మంత్రలు సబిత, ధర్మానకు జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ మెమో దాఖలు చేసింది. కేసు నుంచి బయటపడతామని సబిత, ధర్మాన మీడియాతో మాట్లాడటం దర్యాప్తునకు అటంకమని సీబీఐ పేర్కొంది. ధర్మాన, సబిత మీడియాతో మాట్లాడిన వివరాలను సీడీ వివరాలను సీడీ రూపంలో కోర్టుకు సమర్పించింది. జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా వ్యవహారానికి సంబంధించిన ఛార్జిషీటుపై సీబీఐ కోర్టులో విచారణ ప్రారంభమైంది. విచారణకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.