సబ్సిడీపై గడ్డి విత్తనాలు

జుక్కల్, అక్టోబర్ 7,( జనం సాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని పశువైద్యశాలలో గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పశువైద్యాదికారి పండరినాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈవిత్తనాలు 50శాతం సబ్సిడి పై అందజేయడం జరుగుతుందన్నారు. సబ్సిడి పోను 5కేజీలవిత్తనాలు బ్యాగు 110రూపాయలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విత్తనాలు కావలసిన పశుపోశకులు ఆధార్ కార్డ్ జీరాక్స్ తీసుకుని పశువైద్య శాలలో సంప్రదించాలని ఆయన కోరారు.