సబ్సిడీ పేరుతో నగదు బదిలీయా? ఏచూరి
న్యూఢిల్లీ: సబ్సిడీలలో కోత పెట్టడం, ప్రజా పంపిణీ వ్వవస్థణు నాశనం చేయడమే నగదు బదిలీ పథకం వెనుక ఉద్దేశమని సీపీఐ(ఎం) జాతీయ నాయకుడు సీతారం ఏచూరి విమర్శించారు. న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ పేరుతో నేరుగా డబ్బును ప్రజలకు అందిస్తోందని అన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కొంత కాలం తర్వాత సబ్సిడీలలో కోతపెట్టి ప్రజలపై పూర్తి భారాన్ని వేస్తారని ఆరోపించారు.