సబ్‌ప్లాన్ చట్టబద్ధత మేడమ్‌కు నేనే చెప్పాను కేంద్రమంత్రి చిరంజీవి
హైదరాబాద్, డిసెంబర్ 1 (జనంసాక్షి):
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీ విజయంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అభివర్ణించారు. శనివారం కాంగ్రెస్ శాసనసభ పక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశలో సోనియా గాంధీకి నిర్మాణాత్మకమైన సూచన చేశానని చిరంజీవి గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీల నిధులు దారిమళ్లకుండా ఉండేందుకు ఈ చట్టం దోహదపడుతుందని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పూర్తి భద్రత కల్పించేందుకు ఈ బిల్లు తొలిమెట్టు అని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికకు చట్టబద్దత కల్పించేం దుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడంపై ఆయన స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉప ప్రణాళిక బిల్లుకు చట్టబద్దత కల్పించడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని ఆయన కోరారు. సామాజిక న్యాయం నేపథ్యంలో ప్రజారాజ్యం